అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి
సిఐటియు జిల్లా అధ్యక్షుడు: రాజు
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ సమావేశం సిఐటియు మండల అధ్యక్షుడు ఉస్మాన్ అధ్యక్షతన శనివారం రోజున జరిగింది.సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు మాట్లాడుతూ కార్మిక వర్గంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతూ కార్మిక చట్టాలను రద్దుచేసి కోడ్ లను తీసుకొచ్చిందన్నారు.హమాలి ఆటో యూనియన్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు జరగాలన్నారు.అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని,అన్ని రంగాల కార్మికుల కార్మికుల హక్కులను కాపాడాలంటే ప్రభుత్వం పైన పోరాటం నిర్వహించాలని కార్మికులకు సూచించారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ మండల అధ్యక్షురాలు సమ్మెట లలిత, సిఐటియు హమాలీ సంఘం అధ్యక్షుడు కోడిసంపత్,పుల్లయ్య,శ్రావణి,సరిత,సోమిరెడ్డి,కవిత,రమేష్,వెంకన్న,రవి వీరన్న,కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


