సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు
ఓరుగల్లు కోటలో రైతులకు ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు
సేంద్రియ ఎరువులతో పండించే పంటలకు ఉచిత మొక్కల పంపిణీ
జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా రైతులకు సమకాలీన వ్యవసాయ సాంకేతికతలపై రైతుల్లో అవగాహన పెరగడం కోసం ఓరుగల్లు కోటలో శనివారం రోజున రైతులకు ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మట్టి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విజ్ఞానం అందించి, ఆధునిక సాగుబడి పద్ధతులను అవలంబించడం ద్వారా పంటల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అధిక లాభాల వస్తాయని దానికి వ్యవసాయ అధికారులు రైతులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు మట్టి ఆరోగ్యాన్ని పటిష్టం చేసే సేంద్రియ ఎరువులు ఉపయోగించాలన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, పర్యావరణ హిత మార్గాలను ఎంచుకోవాలన్నారు.
సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండించే రైతులకు ప్రభుతమే మొక్కలు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందని , కేవలం రవాణా ఖర్చులు మాత్రం రైతులే చెలించాలని అన్నారు. దీనివలన ఆరోగ్యకరమైన పంటలు అందరికీ అందుబాటులో ఉంటాయని, రైతులకు కూడా అధిక లాభాలు వస్తాయన్నారు.
అలాగే, వరదల వల్ల పంటలకు నష్టమైన రైతులకు నష్టపరిహారం అందించడం , ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరైన నిర్వహణ కల్పించాలన్నారు.
ఈ అవగాహన సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మండల వ్యవసాయ అధికారి విజ్ఞాన్, వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రకాంత్. స్థానిక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు మరియు రైతులు, బోలుగొడ్డు శ్రీనివాస్, చింతం రమేష్, అక్కల సాంబయ్య, సుక్క కుమార్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు


