కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, నడికూడ: కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం నడికూడ మండల కేంద్రంలో ఇటీవీలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు దుప్పటి రవి, తాళ్ళ మల్లయ్య,తాళ్ళ సమ్మయ్య కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ నాయకులు, ఊర రవీందర్ రావు, దురిశెట్టి చందు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.


