epaper
Monday, March 2, 2026
epaper

తేజస్ క్రాష్‌: దేశం కోల్పోయిన ధీరుడు.. ఎవరీ నమాన్ష్ స్యాల్?

తేజస్ క్రాష్‌: దేశం కోల్పోయిన ధీరుడు.. ఎవరీ నమాన్ష్ స్యాల్?
దుబాయ్ ఆకాశంలో విషాదం
దేశం కోసం ప్రాణం అర్పించిన పైలట్ నమాన్ష్ స్యాల్
NDA నుంచి ఆకాశ యోధుడిగా నమాన్ష్ ప్ర‌యాణం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ యుద్ధవిమానం కూలిన ఘటన భారత్‌ను తీవ్ర విషాదంలో ముంచింది. నవంబర్‌ 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తేజస్-ఎమ్‌కే1 ప్రదర్శన విన్యాసాలు చేస్తున్న క్షణాల్లోనే విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. భారీగా మంటలు చెలరేగి, కేవలం కొన్ని క్షణాల్లోనే ఆకాశయోధుడు వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. 34 ఏళ్ల నమాన్ష్ స్యాల్… భారత వైమానిక దళంలో ఒక ప్రతిభావంతుడైన పైలట్. విన్యాసాలు, ఫ్లైయింగ్ టెక్నిక్స్‌లో నైపుణ్యంతో ప్రత్యేక పేరు సంపాదించుకున్న ఆయనకు, ఈ దుబాయ్ ఎయిర్‌షో ప్రత్యేకమైన అసైన్మెంట్. అయితే ఈ ప్రదర్శనే చివరి ప్రయాణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

నమాన్ష్ స్యాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్ర జిల్లాలో జ‌న్మించాడు. పఠియాల్కర్ గ్రామంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచి డిఫెన్స్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి జగన్నాథ్ స్యాల్ కూడా ఆర్మీలో పనిచేయడం ఆయనకు ప్రేరణ. సుజన్‌పూర్ సైనిక్ స్కూల్‌లో చదువుకుంటూ ఆర్మీ జీవితం గురించిన స్పష్టమైన దారిని ఏర్పరుచుకున్నారు. 2009లో నమాన్ష్ NDA పరీక్షను క్రాక్‌ చేసి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టారు. మొదటినుంచి శ్రద్ధగా, క్రమశిక్షణతో పనిచేసిన ఆయన, తక్కువ సమయంలోనే ప్రతిభాపాటవాలు చూపించి వింగ్ కమాండర్‌ స్థాయికి చేరుకున్నారు. తేజస్ MK-1 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లను నడపడం అంటే ప్రత్యేక నైపుణ్యం అవసరం.. ఆ నమ్మకాన్ని నమాన్ష్ స్యాల్ సంపాదించారు.

నమాన్ష్‌కు భార్య, ఓ చిన్నారి కూతురు ఉన్నారు. భార్య కూడా భారత వైమానిక దళంలోనే పని చేస్తోంది. నమాన్ష్ తల్లిదండ్రులు ప్రస్తుతం కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తొలిసారి యూట్యూబ్ వీడియోలో చూశాన‌ని తండ్రి జగన్నాథ్ స్యాల్ చెప్పారు. ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇంటికి రావడం చూసి, ఏదో అనర్థం జరిగిందని అర్థమైందని ఆయన వెల్లడించారు. నమాన్ష్ ఎప్పుడూ చదువులో, ఫిజికల్ ట్రైనింగ్‌లో కృషి చేసే వ్యక్తి అని, ఏదీ అర్ధాంతరంగా వదిలిపెట్టేవాడు కాదని ఆయన తండ్రి చెప్పారు. దేశ సేవలోనూ అదే నిబద్ధత కనబరిచాడని కన్నీటి స్వరంతో ఆయన గుర్తుచేసుకున్నారు. వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్… ఆకాశాన్నే తన ఇల్లు చేసుకున్న యోధుడు. దేశం కోసం ప్రాణం అర్పించిన వీరుడు. ఆయన సేవలకు భారతం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img