25 కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తిమండలంలోని వాల్మీడి ముత్తారం నర్సింగాపురం గ్రామాల్లో సాగునీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల నిల్వ, రైతాంగానికి శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 కోట్ల రూపాయల చెక్‌డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశశ్విని రెడ్డి శంకుస్థాపన చేసి అధికారులతో కలిసి పనుల పురోగతి, నిర్మాణ రూపకల్పన గురించి సమగ్రంగా సమీక్షించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం వ్యవసాయం ఆధారిత ప్రాంతం ప్రతి గ్రామానికి నిల్వనీటి సౌకర్యాలు సాగునీటి భద్రత అత్యవసరము. వాల్మీడి ముత్తారం నర్సింగాపురం గ్రామాల్లో చేపట్టనున్న ఈ చెక్‌డ్యాం పనులు పూర్తయ్యాక వేల ఎకరాలకు జీవదాయిని అవుతాయి రైతుల కలలు నిజమవుతాయి ప్రతి బీడు నేలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేయడం మా ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారుఅధికారులతో మాట్లాడుతూనిర్మాణ పనులు నాణ్యతతో, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందు ముఖ్యమైన దశలను ముగించాలంటూ సూచించారు. చెక్‌డ్యాం ప్రాంతాల్లో చెట్లు నాటడం, పక్క ప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి చర్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారుఈ శంకుస్థాపనకార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు తమ ప్రాంతాల్లో భారీ నిధులతో చెక్‌డ్యాం పనులు ప్రారంభించి నందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు


