ఇండ్లు పంచ లేదనే గత ప్రభుత్వాన్ని గద్దె దించారు
పంచ కుండ ఉండడం ప్రభుత్వానికి సరికాదు రిటైర్ టీచర్
8వ రోజుకు చేరిన రిలే దీక్షలకు మద్దతు తెలిపిన యుటిఎఫ్ నాయకులు
కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము లోనిగోపాల గిరి రోడ్డు పక్కనకట్టిన ఇండ్లను పంచలేదనే గత ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి 2 సంవత్సరాలు కావస్తున్న ఇండ్లను పంపిణీ చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని రిటైర్డ్ టీచర్, యూటీఎఫ్ నాయకులు బంధు నారాయణ డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ రిలే దీక్షలకు రిటైర్డ్ టీచర్ సంఘీభావం తెలిపారు. అనంతరం సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బందు నారాయణ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలు 7 నెలలుగా నిరసనలు తెలుపుతుంటే స్థానిక ఎమ్మెల్యే స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరి కాదని ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే ఇండ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డోనుక దర్గయ్య, జమ్ముల శ్రీనివాస్, కొమ్మనబోయిన యాకయ్య, దొమ్మటి సోమయ్య కొమ్మనబోయిన పుష్ప ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ అమీర్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట కమిటీ లీడర్లు శోభ, వరలక్ష్మి, అరుణ, శమీన, అమీన, రాధ, మంజుల, శ్రీలత, సాయిలు స్వరూప, సభ్యులు గడ్డల మల్లయ్య, రామగిరి రవి శంకర్, దస్తరి భాగ్య, గాజుల లక్ష్మి, ఈదురు లక్ష్మి, మోతే చైతన్య, చెడుపాక శారద, బొమ్మన బోయిన రజిత, కొలిపాక నవిత, వెన్నెల, తదితరులు పాల్గొన్నారు.


