ఐఏఎస్ల ఆదర్శ వివాహం
ఆర్భాటం లేకుండా రిజిస్ట్రార్ మ్యారేజ్
గొప్పలకు పోయి..తిప్పలు పడొద్దు..అప్పలు చేయొద్దు అంటూ నెటిజన్ల స్పందన
కాకతీయ, ఏపీ బ్యూరో : అత్యంత నిరాడంబరంగా యువ ఐఏఎస్ లు వివాహంతో ఒక్కటయ్యారు. విశాఖపట్నం రిజిస్టర్ కార్యాలయం ఇందుకు వేదికైంది. ఆంధ్ర క్యాడర్ తిరుమణి శ్రీ పూజ ఐఏఎస్, మేఘాలయ కేడర్ ఐఏఎస్ ఆదిత్య వర్మలు శనివారం విశాఖపట్నం రిజిస్టర్ కార్యాలయంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. శనివారం జరిగిన ఈ వేడుకలో కేవలం రెండు కుటుంబాల సమక్షంలో ఆత్మీయుల మధ్య జరిగింది. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా వెళ్ళి చేసుకున్నారని ప్రజలు అభినందిస్తున్నారు. లేని గొప్పలకు పోయి..అప్పులు చేసి మరీ వివాహం చేసుకుని ఆతర్వాత తిప్పలు పడుతున్న నేటి యువతకు, వారి తల్లిదండ్రులకు వీరి ఆదర్శ వివాహం ఒక కనువింపు కలిగించాలంటూ నెటిజనట్లు స్పందిస్తున్నారు. వివాహంలో ఉండాల్సింది ఆర్భాటాలు కాదు… ప్రేమ, పరస్పర గౌరవం, ఆర్థిక భారం లేని నూతన జీవితమే అసలు శోభ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఆదర్శంగా నిలిచిన ఈయువ ఐఏఎస్ జంటకు హృదయపూర్వక శుభాభినందనలు.


