చెకుముకిలో ఎంజేపీ విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, దుగ్గొండి: జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ 2025 టాలెంట్ టెస్ట్ లో మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ప్రథమ స్థానంలో నిలిచిన యశ్వంత్, రుత్విక్, చిన్నుకు ఎస్సై రణధీర్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, ఏటీపీ సతీష్, వార్డెన్ సమత, సిబ్బంది అభినందించారు.


