కాకతీయ, జనగామ : గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి ప్రజల నుండి వివిధ దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, భూమి వారసత్వ సమస్యలు, పంచాయతీ భూముల పంపకం వంటి పలు అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనంతరం ఒక చిన్నారి రాఖీ కట్టగా, కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత వస్త్రాలు, పచ్చళ్లు, షాంపూలను పరిశీలించి, నాణ్యతతో పాటు సరసమైన ధరలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవో గోపిరామ్, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


