అధికసాంద్రత పద్ధతిలో పత్తి పండించాలి
కాకతీయ, గీసుగొండ: అధికసాంద్రత పద్ధతిలో పత్తి పంటను పండించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని అనంతారం గ్రామంలో నిర్వహించిన పత్తి క్షేత్ర దినోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. రైతులు ఈ పద్ధతిలో సాగు చేస్తే కూలీల ఖర్చు తగ్గి, పంట కాలం తగ్గి, దిగుబడి పెరుగుతుందని నిపుణులు తెలిపారు. గులాబీ పురుగు ప్రభావం నివారణకు సమగ్ర సస్యరక్షణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పంట నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలను శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ఎస్. బిందు మాధురి, వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.సౌమ్య, డా. రాజు, మురళి, నాగరాజు, సురేష్, హర్ష రెడ్డి, సాయి చంద్, ఏఈఓ అఖిల, రైతులు బి. నరసింహారావు, డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


