epaper
Friday, November 21, 2025
epaper

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో పతాకవిష్కరణలు, బైక్ ర్యాలీ

చెరువులను రక్షించాలని తహసీల్దార్ కు వినతి

కాకతీయ, దుగ్గొండి: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు, పొన్నం మొగిలి ముదిరాజు ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో శుక్రవారం మత్స్య సహకార సొసైటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గిర్నిబావి నుండి దుగ్గొండి వరకు నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుండి మత్స్యకారులు, ముదిరాజ్ కులస్థులు మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో బజెండా ఆవిష్కరణలు జరిగాయి. దుగ్గొండి మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ జండాని ఎగరవేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 26 లక్షల మంది ఉన్న ముదిరాజ్ సమాజం జనాభా బలానికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ-డీ ఉపవర్గంలో ఉన్న ముదిరాజ్‌ను బీసీ-ఏ జాబితాలో చేర్చి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని, రుణమాఫీ, చేపల విత్తనాల సకాల సరఫరా, రిజర్వాయర్లలో స్థానిక సొసైటీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి ఆర్థిక హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల్లో ముదిరాజ్ లకు అధికంగా అవకాశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రాబోయే రోజుల్లో “మనమెంతో.. మనకు అంతా” అనే నినాదాన్ని నిజం చేయడానికి నిరంతర పోరాటం సిద్ధంగా ఉండాలని జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్, ఎన్ఆర్ఐ రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ రాజేశ్వర్ రావు కు నిరుద్యోగులైన ముదిరాజ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, అక్రమణకు గురవుతున్న చెరువులను కాపాడాలనే డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు నీరటి సదానందం ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె రమేష్, మండల అధ్యక్షులు ముత్యాల స్వామి, జిల్లా నాయకులు గిన్నె భాస్కర్, నేదురు రాజేందర్, బండారి ప్రకాష్, వరంగంటి తిరుపతి, దండు చిరంజీవి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు ఈర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు

హైకోర్టు ఆదేశాలతో డీసీఓ ఉత్తర్వులు నర్సంపేట డివిజన్ లో ఐదు పీఏసీఎస్ లలో...

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల...

మెరుగుపడిన ఆర్టీఏ ట్రాక్

‘కాకతీయ’ కథనంతో స్పందించిన అధికారులు పిచ్చిమొక్కల తొలగింపు, మురుగునీటి గుంతల...

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి 26న మండల కేంద్రాల్లో ప్రదర్శనలు,...

కేటీఆర్‌పై ఏసీబీ విచారణ రాజకీయ డ్రామా

కాకతీయ, భూపాలపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు...

బాధిత కుటుంబానికి పరామర్శ

కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో ప్రముఖ మెడికల్...

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ మండల యూత్...

పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి

పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళి లావణ్య మెడికల్ షాపు యజమాని గోపాల్ తండ్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img