కాకతీయ, హనుమకొండ : మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం మంత్రి కొండా సురేఖ నివాసాన్ని ముట్టడించారు. డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా, మధ్యాహ్న భోజన బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు ఇవ్వకూడదని కోరారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద.. మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


