కాకతీయ, భూపాలపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన అధ్యక్షుడు, బీఆర్ఎస్ యువనేత వీసం భరత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీలు కలిసి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు విషయంలో ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగినప్పటికీ, మళ్లీ విచారణ పేరుతో ప్రభుత్వం ప్రజల్లో దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిన కేటీఆర్‌పై బురదజల్లే కుట్ర ఇది అని భరత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమ కేసులకు భయపడదని, న్యాయపరంగా గట్టిగా ఎదుర్కుంటుందని స్పష్టం చేశారు.


