కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో ప్రముఖ మెడికల్ షాపు యజమాని మాదారపు వేణుగోపాల్ తండ్రి కృష్ణమూర్తి (85) మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కృష్ణ మూర్తి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి గోపాల్ ను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, గిరిజన సమన్వయ కమిటీ కన్వీనర్ ధరావత్ జైసింగ్, ప్రముఖ వ్యాపారి తోట పూర్ణ చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.


