హైకోర్టు తీర్పు.. సొసైటీ చైర్మన్ గా రామస్వామి నాయక్ ప్రమాణస్వీకారం..
సొసైటీ చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రామస్వామి నాయక్ & పాలకవర్గం
హైకోర్టు తీర్పుతో పూర్తిస్థాయి పాలకవర్గం నియామకం
ధర్మాసనం తీర్పు అధికార పార్టీకి చెంపపెట్టు లాంటిది
సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్
కాకతీయ, ఖానాపురం : ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నర్సంపేట నియోజకవర్గం లో ఐదుగురు సొసైటీ చైర్మన్ లతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేయించడంపై హైకోర్టు ధర్మాసనం తీర్పు అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ అన్నారు. హైకోర్టు తీర్పు ఆదేశానుసారం వరంగల్ డి సి ఓ ఉత్తర్వుల మేరకు శుక్రవారం సొసైటీ ఆవరణలో ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం చైర్మన్ గా గుగులోతు రామస్వామి నాయక్, వైస్ చైర్మన్ గా దేవినేని కృష్ణ పాలకవర్గ సభ్యులతో సొసైటీ సీఈఓ ఎల్లబోయిన ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో చైర్మన్ రామస్వామి నాయక్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహంతో కక్షపూరిత తత్వానికి హైకోర్టు తీర్పు ద్వారా ఖానాపురం సొసైటీ చరిత్రలో ఒకే పాలకవర్గం మూడుసార్లు తిరిగి అధికారం దక్కించుకోవడం అధికార పక్ష అహంకారానికి కళ్లెం వేసిందని దీన్ని ప్రజలందరూ స్వాగతించారని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం, రైతుకు లాభం చేకూర్చే సొసైటీలకు కొనుగోలు కేంద్రాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలు కేంద్రాలు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధమ స్థానంలో ఉన్న సొసైటీని వీరి వికృత చేష్టల వల్ల కనీసం మండలంలోని రైతులకు యూరియా అందించాలని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల వాన కాలంలో యూరియా దొరకగా పంటలు ఎండిపోతే.. నేడు యాసంగి సీజన్ గాను ఇప్పుడే యూరియా కొరత ఏర్పడుతుందని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాన్యాకారంగా పిలవబడే ఖానాపురం మండలానికి అధిక యూరియా నిల్వలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవినేని వేణు కృష్ణ సొసైటీ వేములపల్లి సునీత, నీలం సాంబయ్య, ఆబోతు అశోక్, భూషబోయిన రాజు, సొంటి లక్ష్మణ్, బత్తిని భాగ్యలక్ష్మి, మేకల కుమారస్వామి, బుద్దే తిరుపతి, అన్నమనేని రవీందర్రావు, జాడి అచ్యుతం, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామసహాయం ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు వేజెల్ల కిషన్ రావు, బోడ పూలు నాయక్, వల్లెపు శ్రీనివాస్, రెడ్డి నాగార్జున రెడ్డి, మౌలానా, తిరుపతిరెడ్డి, బంధారపు శ్రీనివాస్, వడ్డె రాజశేఖర్, మచ్చిక అశోక్, నేలమర్రి నాగరాజు, మునిందర్, సొసైటీ సిబ్బంది మెరుగు రాజు, కడుదూరీ వినయ్, కొమురయ్య, అశోక్, భీమయ్య, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




