సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పట్టణానికి చెందిన పేద రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెచ్చించిన వ్యయానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం కోసం లబ్ధిదారులు సమర్పించిన దరఖాస్తులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫారసు చేయగా, వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది.
శుక్రవారం ఎమ్మెల్సీ సారయ్య నివాసంలో జరిగిన కార్యక్రమంలో 12 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న జన్ను లోకేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కు కూడా అందజేశారు.
ఈ సందర్భంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలతో ఉన్న ప్రభుత్వం, పేదల అభ్యున్నతికి మరియు ఆర్థిక సహాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, జన్ను రవి, రామ బాబురావు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోరంట్ల రాజు, సీనియర్ నాయకులు రాముల బాబు, ఏం. బాడీ అమరేందర్, నరిగే శ్రీను, బండ్ల సురేందర్, గుండేటి సతీష్, ఎండి జాహీర్ తదితరులు పాల్గొన్నారు.


