epaper
Monday, March 2, 2026
epaper

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి
ఈటల డిమాండ్

హుజూరాబాద్ ప్రజలే నా బలం ఎలా మర్చిపోతా ఈటల

కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో రోజులు లాగుతున్నారు. క్వింటాల్‌కు ఎనిమిది కిలోలా తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్ ఇప్పటికీ అందరికీ చేరలేదని, ఈసారి అయినా ప్రతి రైతుకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.రైతు రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదని, వరదలతో మునిగిన వరి రైతులు, తుఫానుతో నష్టపోయిన రైతులు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల సహాయం వెంటనే అందేలా చూడాలన్నారు. పత్తి కొనుగోళ్లలో కూడా జాప్యం ఉండకూడదని, కఠినమైన ‘7 క్వింటాళ్ల’ నిబంధనను ఎత్తివేయాలని, వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీసీఐ కూడా నిబంధనలు సడలించాలని కోరారు. ఫసల్ భీమా చెల్లింపులు ప్రభుత్వం సమయానికి చేస్తే రైతులు ఇబ్బందులు పడేవారేమన్నారు.

హుజూరాబాద్‌లో మాకు మెజారిటీ సీట్లు ఈటల ధీమా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండేందుకే వారి పాత్ర కీలకమని చెప్పారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నందున బూతు స్థాయిలో పటిష్ట బలం ఏర్పరుస్తామని ప్రకటించారు. జిల్లాలోని 107 గ్రామ పంచాయతీల్లో ఎక్కువ భాగం తమ పార్టీ గెలుచుకునే సత్తా ఉందన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటేసిన ప్రజలు ఎదురుచూసిన పనులు రెండు సంవత్సరాలుగా జరగకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు.నన్ను 25 సంవత్సరాలుగా గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్ గడ్డ ఆ ప్రజలను ఎలా మర్చిపోతా అని భావోద్వేగంతో చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, చీకట్లోనే రోజులు గడుస్తున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.

ఉన్నదాన్ని చెప్పుకోలేని వారు అబద్ధాలతో బ్రతుకుతున్నారు

తాము చేసిన అభివృద్ధి పనులను ఎప్పుడూ ప్రచారం చేయలేదని, ధర్మాన్ని, ప్రజలను, పనిని నమ్ముకున్న వాడినేనని ఈటల అన్నారు.తట్టెడు మట్టి తీయలేదంటారా హుజూరాబాద్‌లో వేగవంతమైన నాలుగు లైన్లు ఎవరు వేశారు? కరెంట్ కోసం కంటిరెప్పపాటు ఎదురు చూడని విధంగా సబ్‌స్టేషన్లు ఎవరు నిర్మించారు? జలకళ కోసం చెక్‌డ్యామ్‌లు ఎవరు కట్టించారు? కమలాపూర్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.ఇవన్నీ ప్రజలకు తెలుసు దొంగముఖాలకు అర్థం కాదు. అబద్ధాలే ఆధారంగా బ్రతికే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభా, బీజేపీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ సురేందర్ రాజు, మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మహిళా మోర్చా జిల్లా ప్రతినిధి రమరెడ్డి, పార్టీ నాయకులు సమ్మయ్య, దేవిక, చొప్పరి వేణు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img