గుట్ట శిఖం ఆక్రమణ
కాకతీయ,నర్సింహులపేట: గుట్ట శిఖమును ఆక్రమణకు గురిచేస్తున్నాడంటూ మండల కేంద్రానికి చెందిన వనకూరి వెంకటనరసయ్య గురువారం తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన పెద్దగుట్ట చుట్టూ బాట ఉండేదని,అట్టి బాటను కొంతమంది భూకబ్జాదారులు తమ ఆధీనంలోకి తీసుకొని చుట్టూ పెన్షన్ తిప్పుతున్నారని ఫిర్యాదు చేయడంతో ఆర్ఐ అఖిల్,సర్వేయర్ గుట్ట ప్రాంతానికి ప్రాంతానికి వెళ్లి పనులను నిలిపివేశారు.గుట్ట చుట్టూ దారి ఉందని గ్రామ ప్రజలు అధికారులకు తెలియజేశారు.చారిత్రాత్మకమైన పెద్దగుట్ట చుట్టూ ఉన్న బాటను కబ్జాదారుల కోరల నుండి కాపాడాలని నర్సింహులపేట గ్రామస్తులు కోరుతున్నారు.


