వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి..
కాకతీయ,వర్థన్నపేట : ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి చెందాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ప్రభుత్వ దవాఖానాలో చోటుచేసుకుంది. అయినవోలు మండలం గర్నెపల్లి గ్రామానికి చెందిన బాల బోయిన మల్లయ్య (65) వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఉన్న తమ బంధువుల ఇంటికి బుధవారం చేరుకున్నాడు.రాత్రి సమయంలో మల్లయ్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా బంధువులు హుటాహుటిన వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాచారు.ఆసుపత్రిలో సమయానికి వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందకనే మల్లయ్య మృతి చెం దాడని బంధువులు ఆరోపించారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్యూటీ పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులను విధులనుంచి బహిష్కరించాలని, మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేసారు.


