భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హీరో…
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని గురువారం ప్రముఖ తెలుగు సినీ హీరో ఆది సాయికుమార్, అర్జన శంభాల చిత్రం యూనిట్ వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్నపన మండపంలో భద్రకాళి శేషు, వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులున్నారు.


