భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ సందర్శనం
కాకతీయ, వేములవాడ : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ప్రభుత్వం విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రి కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. తదుపరి ఆలయ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.కార్యక్రమంలో సీఐ వీర ప్రసాద్, ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఏఈఓ బ్రహ్మంగారి శ్రీనివాస్, జయకుమారి, అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


