హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు
కాకతీయ, ఖమ్మం : హోంగార్డు ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ ఉన్నతాధికారులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత అధికారులతో పోలీస్ ఉన్నత అధికారులు ఈ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పోలీస్ హెడ్ క్వాటర్స్ లోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, బజాజ్ అలియాంజ్ సాధారణ భీమా భాగస్వామ్యంలో తక్కువ ధరలో 33 లక్షల ఆరోగ్య బీమా పథకం ద్వారా హోంగార్డ్ ఉద్యోగులు పొందే ప్రయోజనాల గురించి వారికి వివరించారు కార్యక్రమంలో ఏఆర్ ఎసిపి సుశీల్ సింగ్, నరసయ్య ఆర్ఐ సురేష్ పాల్గొన్నారు.


