విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు
వైద్యధికారి మానస
కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఒత్తిడిని జయించాలని, మానసిక ఒత్తిడికి గురికావద్దని వైద్యాధికారి మానస అన్నారు. గురువారం మండలంలోని కేజీబివి పాఠశాలలో మానసిక ఒత్తిడిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తే ప్రగతి సాధిస్తారన్నారు. విద్యపైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడి జయించాలంటే యోగా, ధ్యానం తోపాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదివితే మంచి స్ధాయికి చేరుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఓ స్రవంతి,ఏఎన్ఎం అనూష,ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



