హిడ్మా ఎన్కౌంటరు… బూటకమే!
కేంద్రంపై మండిపడ్డ సంపత్ పూర్తి విచారణకు డిమాండ్
కాకతీయ, హుజురాబాద్ : మావోయిస్టు నేత హిడ్మా మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ఈ ఘటన బూటకపు ఎన్కౌంటర్‌గా బహిర్గతమవుతోందని టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ ఆరోపించాడు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ హిడ్మా కేసులో అనేక అనుమానాలను లేవనెత్తాడు.అడవుల్లో తిరిగే హిడ్మా అతనితో ఉంటూ రక్షణ కల్పించే 28 మంది మావోయిస్టులు విజయవాడ నగరంలో ఒక ఇంట్లో ఎలా దొరకారు? ఈ ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలంటూ సంపత్ డిమాండ్ చేశాడు. అరెస్టు చేసిన తర్వాత హిడ్మాను, అతని భార్యను, మరో ముగ్గురిని హింసించి చంపారని ఆరోపించాడు.గత ఆరు నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని, మావోయిస్టుల సమస్యల మూలాలు పరిష్కరించకుండా బలప్రయోగంతో వెళ్లడం తప్పుడు పద్ధతి అని సంపత్ విమర్శించాడు.గిరిజనులు, హరిజనుల సమస్యలపై హిడ్మా రెండుదశాబ్దాలుగా పోరాడుతున్నాడని, అతని పోరాటాన్ని అణచేందుకు కేంద్రం ఈ ఘటనను న్యాయబద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించాడు.లొంగుబడి కోసం వచ్చిన వారినీ చంపడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విరుద్ధం అని ఆయన అన్నారు.హిడ్మా దేవస్థానంగా చూపించిన ఈ ఘటనపై కోర్ట్లు సుమోటోగా కేసు తీసుకోవాలని, ఎన్కౌంటర్‌లో పాల్గొన్న అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని సంపత్ డిమాండ్ చేశాడు. అలాగే ఎన్కౌంటర్లపై బహిరంగ వ్యాఖ్యలు చేసే జాతీయ నేతలపై కూడా చట్టపరమైన చర్యలు అవసరమని పేర్కొన్నాడు.


