వేములవాడలో డ్రైనేజీలో పడి యువకుడు మృతి
కాకతీయ, వేములవాడ : వేములవాడ రెండో బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. బద్ది పోచమ్మ ఆలయానికి చెందిన కార్మికుడు గోవింద్ అభినవ్ ఇంటికి వెళ్తుండగా ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అభినవ్ ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు,నేరుగా డ్రైనేజీలో పడిపోవడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయని, వెంటనే ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపిన వివరాలు. గురువారం ఉదయం ఈ ఘటన బయటపడిన వెంటనే ప్రాంతంలో కలకలం రేగింది. బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాల నిర్ధారణ కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


