మునిసిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ
కాకతీయ, ఖిలావరంగల్: తూర్పుకోట పోచమ్మ గుడి ఆవరణలో బోలుగొడ్డు ఆచారి, మధురమ్మ, అమృతమ్మ జ్ఞాపకార్థం, వారి కుమారులు, కుటుంబ సభ్యులు 37వ డివిజన్ మున్సిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కార్మికులకు దుప్పట్లు అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తిస్తూ కుటుంబ సభ్యులు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమంటూ ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో బోలుగొడ్డు ఆచారి కుమారుడు బొలుగొడ్డు శ్రీనివాస్, కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, నాయకులు బస్వరాజు కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ జన్ను రవి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, 37వ డివిజన్ తూర్పుకోట అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.


