epaper
Thursday, November 20, 2025
epaper

అక్రమ పట్టా రద్దు చేయాలి

అక్రమ పట్టా రద్దు చేయాలి
పేదలకు పట్టాలు ఇవ్వాలి
కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర నాగారం రెవెన్యూ శివారు సర్వే నం. 109/ఏ/ఈలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పుల్యాల వసంత పేరుతో అక్రమంగా పట్టా మంజూరు చేయడంపై సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేసి, భూమిలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భూమిగా ఉన్న ఈ 40 ఎకరాల్లో 30 ఎకరాలపై చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారని, మిగిలిన 10 ఎకరాల్లో 570 మంది పేదలు ఐదేళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని తెలిపారు. ఈ భూమికి పుల్యాల వసంతకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆమె భర్త కృష్ణారెడ్డి లాయర్ ప్రభావాన్ని వినియోగించి దొంగ పత్రాలు సృష్టించి అక్రమంగా పట్టా తీసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి భూమి ప్రభుత్వదేనని స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఇన్చార్జి కలెక్టర్, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య కూడా ఇదే నిర్ణయాన్ని వెలువరించారని చెప్పారు. ఈ భూమిపై కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. పేదలను, రైతులను బెదిరించి, చట్టాలను ఉల్లంఘించి భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూమిపై నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ భూమి కోసం సిపిఎం ఎన్నో సార్లు పోరాటాలు చేసినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అక్రమ పట్టాను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు, తీగల ఆగిరెడ్డి, గొంది రాజేష్, రత్నం ప్రవీణ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కలవల రవీందర్‌తో పాటు మండల కమిటీ సభ్యులు కడారి నాగరాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, శాఖ కార్యదర్శి శ్రీరామోజు సువర్ణ, చిన్నపెళ్లి అశోక్, తిప్పర్తి సరళ, కోయిల సులోచన, మన్సోజు బ్రహ్మచారి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి

పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...

మునిసిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ

మునిసిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ కాకతీయ, ఖిలావరంగల్: తూర్పుకోట పోచమ్మ గుడి ఆవరణలో...

పూర్తయిన పనులను పరిశీలించిన కమిషనర్

పూర్తయిన పనులను పరిశీలించిన కమిషనర్ కాకతీయ, వరంగల్ : వరంగల్ నగర పరిధిలో...

కాంగ్రెస్ పాలనలో ప్రతీ కుటుంబానికి భరోసా

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కాకతీయ పాలకుర్తి:...

ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం

ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం కాకతీయ, గీసుగొండ: ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన...

అనుమానాస్పదంగా మహిళ మృతి

అనుమానాస్పదంగా మహిళ మృతి కాకతీయ, నెల్లికుదురు: అనుమానాస్పదంగా మహిళా మృతి చెందిన ఘటన...

పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలి

పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలి టాయిలెట్ల నిర్వాహకులతో మేయర్ సుధారాణి కాకతీయ, వరంగల్: నగరంలో...

ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన

ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img