హుజురాబాద్‌లో బీసీ జేఏసీ సమావేశం
కాకతీయ, హుజురాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని హుజురాబాద్ బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హుజురాబాద్ పట్టణంలోని బీఎస్ఆర్ గార్డెన్స్‌లో బీసీ జేఏసీ నేత చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందేల వెంకన్న కన్వీనర్‌గా వ్యవహరించారు. సమావేశంలో పాల్గొన్న బీసీ జేఏసీ అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఇటీవల క్యాబినెట్ పాత రిజర్వేషన్ విధానాన్నే అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. తమ ప్రభుత్వంలో కామారెడ్డిలో ప్రకటించినట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టపరంగా అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యం సాధించే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకత్వం పర్యటించి బీసీలను చైతన్యపరచాలని కోరారు. సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు చిలకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉప్పు శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఎర్రబొజ్జ నారాయణ పాల్గొన్నారు. వక్తలుగా తడికమల శేఖర్, కట్కూరి రాజేందర్ మాట్లాడారు. అఖిలపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బండారి సదానందం, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎనగందుల వెంకటేశ్వర్లు, తొగరు బిక్షపతి, సొల్లు బాబు, మాడుగుల ఓదెలు, చల్లూరి రఘు చారి, దేవునూరి రవీందర్, రామ్ సారయ్య, చిట్యాల భాను, తాటిపాముల కనకయ్య, బొంగోని వెంకటయ్య, చీకట్ల సమ్మయ్య, దొంత హరికిషన్, గాజర్ల బుచ్చిరాజం, ఓడ్నాల ప్రభాకర్, కే. రామచంద్రం, గోస్కుల నాగమణి మధుకర్, జూపాక శివమణి, గరవేణి శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


