గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాకతీయ, కరీంనగర్ : గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు స్వయంగా పాల్గొని గ్రామాలు ప్రగతి పథంలో నడవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మానకొండూర్ మండలం శంషాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యమే అభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామస్థుల అవసరాలకు అనుగుణంగా చేపట్టే పనుల్లో ప్రజలు సక్రియంగా పాలుపంచుకుంటేనే పనుల్లో నాణ్యత పెరుగుతుందన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో జరిగే కార్యాచరణపై ప్రజలు నిరాసక్తత చూపకుండా, పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. సొంత భవనాలు లేని పంచాయతీలకు, కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు భవన నిర్మాణ నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
భూమిపూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
మండలంలోని వన్నారం, గట్టుదుద్దెనపల్లి గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమాల్లో మానకొండూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరలక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రామిడి శ్రీనివాస్ రెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కోండ్ర సురేష్, మడుపు ప్రేమ్ కుమార్, పెంచాల రాజయ్య, ఆకుల నర్సింగరావు, కనుకం కుమార్, నీరడి మొగిలి, పెంచాల రంగయ్య, నాగపురి తిరుమల, కనకం సమ్మయ్య, బాకారపు సమ్మయ్య, బాకారపు రమేశ్, చెలిగంటి ఓదెలు, తాళ్లపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి కొమురయ్య, బనుక తిరుపతి, బాకారపు సంపత్, కనకం లచ్చయ్య, ఆనంద్, కవిత, ప్రసూన, పోలాడి రామారావు, గొల్లెన కొమురయ్య, తమిశెట్టి రాజేశ్, సాయిరి దేవయ్య, దుడ్డెల కుమార్ తదితరులు పాల్గొన్నారు.


