పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలి
టాయిలెట్ల నిర్వాహకులతో మేయర్ సుధారాణి
కాకతీయ, వరంగల్: నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి సూచించారు. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకుని బల్దియా పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వారందరినీ సత్కరించారు. అనంతరం వారు తీసిన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజాపాయ్, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, ఎంహెచ్ఓ డా. రాజేష్, శానిటరీ సూపర్ వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్, భాస్కర్, సూపరింటెండెంట్ దేవేందర్, ఆస్కీ ప్రతినిధి రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


