ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన
కాకతీయ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలకేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మంగళపెల్లి యాకాంత తనకు న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కింది. తనకు న్యాయం చేయాలని, అలాగే తొర్రూరు ఎస్సై ఉపేందర్ అన్నదమ్ముల భూ తగాదాలో తమ్ముడికి న్యాయం చేశారని ఆరోపించింది. తనను బెదిరించి సంతకం చేయించి తమ్ముడికి రిజిస్ట్రేషన్ కు సహకరించి తమతో బలవంతంగా సంతకం చేయించారంటూ తమకు న్యాయం జరగలేదని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపింది. తొర్రూరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తమ చావుకు కారణం ఎస్సైయేనని ఆరోపించింది.


