యూరియా కొరత రానీయొద్దు
కాకతీయ, నల్లబెల్లి: మండల వ్యవసాయ అధికారికి జిల్లా రైతు సంఘం నేతృత్వంలో బుధవారం మెమోరాండం సమర్పించారు. వర్షాకాలంలో పత్తి, వరి పంటలకు సరిపడా యూరియా అందక రైతులు భారీ నష్టాలు చవిచూశారని ఉపాధ్యక్షుడు కడియాల వీరాచారి తెలిపారు. రాబోయే రబీ సీజన్లో వరి, మొక్కజొన్న పంటలకు కావలసినంత యూరియాను ముందుగానే నిల్వ ఉంచాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం లింక్ పెట్టి అవసరం లేని మందులను బలవంతం చేసే పద్ధతిని నిలిపివేయాలని కోరారు. బిల్లుల సమ్మె, సీసీఐ కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు మధ్యదళారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. తుఫాను వల్ల నష్టపోయిన పంటలపై రైతులకు పూర్తి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇస్లావత్ నెహ్రూజీ, బుడగ సమ్మయ్య, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.


