చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ
కాకతీయ, హుజురాబాద్ : మానకొండూరు అలుగునూరు నుంచి ఇటుకల లోడుతో హుజురాబాద్ వైపు వస్తున్న ట్రాక్టర్ కెనాల్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, అధిక వేగంతో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అక్కడివారు తెలిపారు.ఢీకొట్టిన ఝట్కాకు ట్రాక్టర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోగా, లోడుతో వచ్చిన ఇటుకలు రోడ్డంతా చిందరవందరగా పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్నవారికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.ప్రాంతంలో ఇటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్‌కు ఇది మొదటిసారి కాదని, తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అధికారులు కూడా పర్యవేక్షణ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


