గట్లకుంట దుర్గమ్మ ఆలయంలో చోరీ
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలంలోని గట్లకుంట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు గ్రామ శివారులోని దుర్గమ్మ ఆలయం తలుపులు పగలగొట్టి అమ్మవారి ముక్కుపుడక, మేడలోని బంగారం,వెండితోపాటు హుండీలో ఉన్న నగదును దొంగలించారు. అనంతరం గ్రామ పక్కనే ఉన్న క్వారీలో హుండీని పడేశారని స్థానికులు తెలిపారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



