బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ
కాకతీయ, రాయపర్తి : మండలంలోని పలు బాధిత కుటుంబాలను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పరామర్శించి, చేయూతనందించారు. మంగళవారం ఆమె సన్నూరు జయరాం తండాకు చెందిన బానోత్ బాలు కూతురు హన్సిత ప్రమాదంలో గాయపడగా వైద్యులు బాలిక కాలును తొలగించారు. విషయం తెలిసి చలించిపోయిన ఝాన్సీరెడ్డి అతి చిన్న వయసులో హన్సిత కాలును కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. సూర్యతండాలో ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురై మరణించిన గుగులోత్ రాజేందర్, గణేష్ కుంట తండాలో మూనావత్ అశోక్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూండగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని ఝాన్సీ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్ రెడ్డి, వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, చిర్ర మల్లయ్య, మచ్చ నీలయ్య, భూక్య సమ్మయ్య, కుంట రమేష్, కాంచనపల్లి వనజారాణి, గోవర్ధన్ రెడ్డి, చెవ్వు కాశీనాథం, ఆకుల సురేందర్ రావు, మాచర్ల ప్రభాకర్, పీరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


