యాసంగికి సరిపడా యూరియా అందించాలి
కాకతీయ, దుగ్గొండి: రైతులకు యాసంగి పంటకు సరిపడ యూరియాను అందించాలని వరంగల్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దుగ్గొండి తహసీల్దార్ రాజేశ్వర్ రావు కు వినతి పత్రం అందించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతాంగానికి ఖరీఫ్ సీజన్లో యూరియా సరిపడ అందించక, పంటలకు సరియైన సమయంలో యూరియా వేయకపోవడంతో పంట దిగుబడి తగ్గిందని అన్నారు. అందువలన వచ్చే యాసంగి సీజన్ కు రైతులందరికీ సరిపడ యూరియాను అందించాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అక్కెపల్లి సుధాకర్, రైతు నాయకులు గొర్రె సంజీవరెడ్డి, రైతులు చల్ల సుభాష్ రెడ్డి, చల్ల వేణు వర్ధన్ రెడ్డి, నకిరబోయిన సదయ్య తదితరులు పాల్గొన్నారు.


