చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది
ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్
కాకతీయ, లక్షెట్టిపేట : చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది అని యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఇన్చార్జి బియాల దినేష్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ పంపిణీక చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… పదో తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే జామెంట్రీ బాక్స్ అందించిన ఫౌండేషన్ వారిని అభినందించారు. అనంతరం ఫౌండేషన్ ఇన్చార్జి బియ్యాల దినేష్ మాట్లాడుతూ…. చదువనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని చదువు మానవ జీవితంలో వెలుగును నింపుతుందన్నారు. చదువుతో పేదరికాన్ని దూరం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా వంతు సహాయంగా జామెంట్రీ బాక్స్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, గడ్డం మహేష్, తోట రవీందర్, వంశీ, సాయి, వాసు, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


