సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్సై ప్రమోద్ కుమార్
కాకతీయ, పెద్దవంగర : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రమోద్ కుమార్ సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని అవుతాపురం గ్రామ హై స్కూల్ లో సైబర్ నేరాలపై 8,9,10 తరగతి విద్యార్థులకు అవగాహనా కల్పించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపునకు నిరంతరం కృషి చేస్తారన్నారు. ప్రజల రక్షణ, మహిళ భద్రత, నేరాల నియంత్రణకు పని చేస్తుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చునని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్, మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలన్నారు. యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుంటూ చెల్లించకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మహి ళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి, వారి రక్షణ గురించి షీటీం పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



