మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి
కేంద్ర మంత్రిని కోరిన మాజీ మేయర్ బిజెపి నేత సునీల్‌రావు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు, కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు కేంద్ర గృహనిర్మాణ,పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు.మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలోని నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్‌రావు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.సునీల్‌రావు మాట్లాడుతూ.కరీంనగర్ నగరపాలక సంస్థలో సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పాలకవర్గం లేనందున 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల కాక నగర అభివృద్ధి కుంటుపడిందని వివరించారు.డంప్‌యార్డు సమస్య వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకోలేని స్థితి నెలకొన్నదని.దీనికి ఇచ్చిన హామీ మేరకు ప్రక్షాళన నిధులు విడుదల చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.మున్సిపల్ ఎన్నికలు వాయిదాపడి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల అభివృద్ధి ఆగిపోయిందని, త్వరగా ఎన్నికలు నిర్వహించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని కూడా కోరారు.కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



