హిడ్మా హతం..!
ఒడిషా బార్డర్‌లో ఎన్ కౌంటర్
హిడ్మాతో పాటు మరోనలుగురు సైతం
మృతుల్లో హిడ్మా భార్య కూడా
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్- ఓడిషా సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం కార్యదర్శి హిడ్మా ఉన్నట్లుగా సమాచారం.

ఐదుగురు మావోయిస్టు మృతదేహాలను గుర్తించిన పోలీసులు ఇందులో హిడ్మాతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అగ్రనేతల్లో కొంతమంది ఇప్పటికే మృతి చెందగా మరికొంతమంది ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. హిడ్మా మాత్రం మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నిర్ణయించుకుని అడవుల్లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో హిడ్మాను లొంగిపోవాలని కోరుతూ ఇటీవల చత్తీస్‌గడ్ హోంమంత్రి స్వయంగా చత్తీస్‌గడ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కోరాడు. అయినా లొంగుబాటుకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన ఆయన్ను రాలేదు. మరో వైపు హిడ్మాను అదుపులోకి తీసుకునేందుకు కూంబింగ్ బృందాలు ప్రయత్నాలను ముమ్మరం చేయగా… హిడ్మా ఎన్‌కౌంటర్ అయినట్లుగా వార్తలు రావడం గమనార్హం. ఈ విషయంపై పోలీసుల నుంచి ధ్రువీకరణ కాలేదు.


