ఘనంగా కార్తిక వనభోజనం
క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ
కాకతీయ, హైదరాబాద్ : క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం కార్తిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి ఖైతాలపూర్ మైదానంలో నిర్వహించిన ఈ వన భోజన మహోత్సవంలోపెద్ద ఎత్తున క్షత్రియులు హాజరై సంతోషంగా గడిపారు. కార్తీక మాస విశిష్టతను చాటిచెబుతూ తొలుత ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు కు ఘనంగా నివాళులర్పించారు. వన భోజన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ వారంతా ఆత్మీయంగా గడిపారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హజరైన శ్రీనివాసరాజు తెలంగాణ ముఖ్య సలహాదారు మాట్లాడుతూ క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాల ఆనందంగా ఉందన్నారు. ఇంత మంది కుటుంబ సభ్యులను కలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవ సమితి అధ్యక్షులు మైనర్ రాజును అభినందించారు. క్షత్రియ సేవ సమితి అనేది క్షత్రియ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి పుట్టిన సంస్థ అని కొనియాడారు, విద్య, ఆరోగ్యం, స్త్రీ సాధికారత, నిరుద్యోగులకు శిక్షణ, అనాథ మరియు వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్నలు పొందుతుందన్నారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఐక్యత, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవ సమితి నిర్వహకులను అభినందించారు. ప్రతి ఏటా ఇలాంటి అత్మీయ కలయిక కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలోవర్టెక్స్ వర్మ, ఎస్ ఎల్ జి హాస్పిటల్ డైరెక్టర్ దండు శివరామరాజు, క్షత్రియ సేవాసమితి చైర్మన్ మైనర్ రాజు, మనోహర్ రాజు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


