బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి
చెల్లించకుంటే బకాయి టెండర్ దారుల ఆస్తులు జప్తు
ఆర్డీవో డీఎస్ వెంకన్న
కాకతీయ పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి బకాయి ఉన్న టెండర్ దారులు వెంటనే బకాయిలు చెల్లించకుంటే ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం బకాయిదారుల ఆస్తులు జప్తు చేస్తామని ఆర్డీవో వెంకన్న హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు ఆలయానికి బకాయి ఉన్న టెండర్దారులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ 2008 నుండి టెండర్ల బకాయిదారులు ఆలయానికి డబ్బులు చెల్లించడం లేదని, వారు పది రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని, లేకుంటే ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా బకాయి టెండర్ దారుల ఆస్తులను జప్తు చేస్తామని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను నిలుపుదల చేస్తామని తెలిపారు. ఈనెల 25న మరోసారి బకాయి టెండర్ దారులతో సమావేశం నిర్వహిస్తామని ఆర్డీవో తెలిపారు. బకాయిదారులు డబ్బులు చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో తహసిల్దార్ శ్రీధర్, ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.


