పిచ్చిమొక్కల తొలగింపు
కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి–మనుగొండ రహదారిపై పెరిగిన పిచ్చిమొక్కలు ప్రయాణీకులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందికంగా మారాయి. ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ తుమ్మనపల్లి సురేష్ అల్లం బాలకిషోర్ రెడ్డికి తెలియజేయగా ఆయన వెంటనే జేసీబీ, డోజర్ సహాయంతో రహదారి పక్కన పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్ల కొమ్మలను తొలగించి మార్గాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు. దీంతో ఆయనకు ప్రజలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీరగొని రాజ్ కుమార్, కందికొండ రాజ్ కుమార్, చాపర్తి కనకయ్య, గాడుదుల బొంద్యాలు, ఏంబాడీ పరమేష్, మాదాసి రాంబాబు, తుప్పరి ఉదయ్, గుడిపల్లి రమణారెడ్డి, బేతినేని నరసింహారావు, మండల వీరస్వామి, దౌడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


