చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం
కాకతీయ, నర్సింహులపేట: చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుల్లా రెడ్డి 42వ వర్ధంతి సభ ఈనెల 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం జరిగే సభ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దంతాలపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి చిర్ర యాకన్న, ఐఎఫ్టీయూ డివిజన్ కార్యదర్శి ఎస్.కె.సాజన్, మల్లయ్య, అజ్మ. అస్లాం కొమ్ము స్వామి, బిక్షం, రాజు రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


