epaper
Monday, November 17, 2025
epaper

చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు

చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు

కాకతీయ,హుజూరాబాద్‌: హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం హెల్ప్ (హార్ట్‌ఫుల్‌నెస్ అనుభవం – జీవిత సామర్థ్యం) ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.హెల్ప్ కార్యక్రమం ప్రాంతీయ సమన్వయకర్త వెంకటరమణ, హుజూరాబాద్ పరిసరాల సమన్వయకర్త శ్రీనివాస్ విద్యార్థులతో మాట్లాడారు. రోజువారీ జీవితంలో ఆహారపదార్థాలు, కూరగాయలు ఏ విధంగా కలుషితమవుతున్నాయి, విద్యార్థులు ఈ వేగవంతమైన జీవితంలో ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారనే అంశాలను వారు వివరించారు.ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు శరీరం ఎదుర్కోనే శ్రమ, ఒత్తిడి ప్రభావాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని, ప్రతిరోజూ కనీసం ఒక గంటపాటు ధ్యానం, యోగా, శారీరక వ్యాయామాలు చేస్తే మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశ అభివృద్ధికి పునాది అవుతారని పేర్కొన్నారు.ఇంచార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ.దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు, ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కూడా అత్యంత ముఖ్యమని తెలిపారు. మంచి ఆహారపద్ధతులు, ఆరోగ్య నియమాలు చిన్నప్పటి నుంచే అలవర్చుకోవాలని విద్యార్థులను కోరారు.ప్రతిరోజూ విద్యార్థులకు యోగా, ధ్యానం నిర్వహించేందుకు కళాశాల విద్యార్థి మార్గదర్శకుడు రాజేశానికి బాధ్యత అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.కార్యక్రమంలో అధ్యాపకులు సుగుణ, శైలజ, జ్యోతి, విజేందర్ రెడ్డి, వాసుదేవరావు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీసీల హక్కులు బీసీలకే దక్కాలి

బీసీల హక్కులు బీసీలకే దక్కాలి జమ్మికుంట సదస్సును విజయవంతం చేయండి నాయకుల పిలుపు కాకతీయ, హుజురాబాద్:...

శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం

శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం అక్రమ అనుమతుల రద్దు కోరుతూ...

యువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలి బండి సంజయ్ సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో కేంద్ర మంత్రి సౌదీ బస్సు...

బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి

బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి...

వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం

వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం కార్తీక దీపోత్సవంలో ప్రత్యేక కార్యక్రమాలు కాకతీయ, వేములవాడ : వేములవాడ...

మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి

మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి సిపిఐ నేతలు కాకతీయ, గోదావరిఖని : ప్రజా, కార్మిక...

రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ కాకతీయ,...

కన్నతండ్రే కాలయముడయ్యాడు

కన్నతండ్రే కాలయముడయ్యాడు అంగవైకల్యంతో ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌డ‌తేర్చాల‌ని చూసిన తండ్రి కూతురు మృతి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img