ఇనుగుర్తి నూతన తహసిల్దార్ గా శ్రీనివాస్
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లో ఇన్చార్జి తహసిల్దార్ తరంగిణి బదిలీపై వెళ్లడంతో నూతన తహసిల్దారుగా పాల్వంచ డీటీగా పనిచేసిన సుంకరి శ్రీనివాస్ ప్రమోషన్ పై మండల నూతన తహసిల్దారుగా సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండల అభివృద్ధిలో భాగంగా మండల ప్రజలందరూ సహకరించాలని, ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.


