శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం
అక్రమ అనుమతుల రద్దు కోరుతూ కలెక్టర్‌కి వినతి
కాకతీయ, కరీంనగర్ : శివనగర్ కాలనీలో ఏర్పాటు జరుగుతున్న ఇండస్/ఎయిర్టెల్ మొబైల్ టవర్‌పై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాలలో అనుమతులు పొందినట్లు ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు 14వ డివిజన్ శివనగర్ నివాసితులు పిర్యాదు సమర్పించారు.ఇంటి నెంబర్ 9-5-171/1 ( ఎస్. నో. 1039) వద్ద టవర్ ఇన్‌స్టాలేషన్‌కు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాసిడింగ్ నెం. ఎంపీ /2024/4048, తేదీ: 26.09.2024 ద్వారా అనుమతి జారీ చేసినట్లు నివాసితులు తెలిపారు. అయితే ఆ ఆస్తి పన్ను రికార్డులు దరఖాస్తుదారుని పేరుపై లేవని, నిజమైన యజమాని కాకుండానే భూయజమాని అనుమతులు పొందారని ఆరోపించారు.స్థానికుల అభిప్రాయాలు సేకరించకుండానే టవర్ పనులు ప్రారంభించడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. మధ్యలో పనులు ఆపాలని కోరగా, టవర్ సంస్థ ప్రతినిధులు, భూయజమాని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ ఇస్తామని బెదిరించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.జనసాంద్రత గల ప్రాంతం కావడంతో మొబైల్ టవర్ రేడియేషన్ ప్రభావం, నిర్మాణ భద్రతపై స్పష్టమైన భయం నెలకొన్నట్లు వాసులు తెలిపారు. ఇళ్లతో పాటు పాఠశాలలు, వృద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో టవర్ అనుపయోగకరమని చెప్పారు.ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పొందిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి.అక్రమ అనుమతులపై సంబంధిత అధికారులు,భూయజమానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.టవర్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి.ఈ విషయంపై ఇంతకుముందూ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు అరజీలు సమర్పించినప్పటికీ స్పందన రాలేదని వాసులు తెలిపారు. ప్రజా భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


