సౌదీలో బస్సు ప్రమాదం.. 42 మంది మృతి
మృతుల్లో 20 మంది మహిళలు.. 11 మంది చిన్నారులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు అందుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంగా.. కేవలం బస్సు డ్రైవర్ మినహా ప్రయాణికులంతా సజీవ దహనమైనట్లుగా సమాచారం. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది. సౌదీ అధికారులు, రక్షణ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల్లో తెలంగాణ, హైదరాబాద్ వాసులు ఉండటంతో వారు ఏ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లారు తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.


