గుజరాత్‌లో వధువును హత్య చేసిన వరుడు
కాకతీయ, నేషనల్ డెస్క్ : పెళ్లికి కేవలం గంట ముందు కాబోయే భార్యను వరుడు దారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన గుజరాత్‌లో జరిగింది. పెళ్లికి ధరించే చీర మరియు డబ్బుల విషయంలో వధూవరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన వరుడు, సాజన్ బరయ్య, ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో వధువు సోని రాథోడ్‌పై దాడి చేశాడు. అనంతరం ఆమె తలను గోడకేసి బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
మృతురాలు సోని (22), నిందితుడు సాజన్ (26) గత ఏడాదిన్నర కాలంగా సహజీవనంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఏర్పాట్లలో ఉండగానే ఇద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి అభిప్రాయ బేధాలు..హత్యకు దారితీసింది. హత్య జరిగిన వెంటనే నిందితుడు సాజన్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.


