వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం
కార్తీక దీపోత్సవంలో ప్రత్యేక కార్యక్రమాలు
కాకతీయ, వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస వేడుకలు భక్తి భావంతో కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 17వ తేదీ సోమవారం ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ప్రవచనం ఇవ్వనున్నారు.‘శివకారుణ్యం’ పేరుతో సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భీమేశ్వర ఆలయం పక్కన ఉన్న శ్రీ భీమేశ్వర సదనంలో ప్రవచనం ప్రారంభమవుతుందని దేవస్థానం అధికారులు వెల్లడించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు భక్తులచే శ్రీ భీమేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దీవెనలు పొందాలని దేవస్థానం వారు సూచించారు.



